ఊట్కూర్‌, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే సహించమని నాణ్యత(Construction)తో ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అన్నారు.

ఆయన శుక్రవారం మండలంలోని దంతనపల్లి, ఉమ కుంట, చెర్రిగూడ టక్కు గూడ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు ఆయా గ్రామాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ మూడు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్నవారికి మృతి చెందిన వారికి ఇండ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

దంతం పెళ్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి(inspected) పలు సూచనలు చేశారు. టక్కుగూడ సమీపంలో ఉన్న పెద్ద వాగుపై వంతెన నిర్మించాలని గిరిజనులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ వాగుపై వంత నిర్మాణానికి కృషి చేస్తానని ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల కళ సా కారం చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదిలాబాద్ ఆర్టిఏ మెంబర్ దూట రాజేశ్వర్, కాంగ్రెస్(Congress) పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ లింగంపల్లి చంద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్, ఉట్నూరు సహకార చైర్మన్ సామ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాస0డ్ల ప్రభాకర్, కొత్తపెళ్లి మహేందర్, అజీముద్దీన్, కలీం, రాజేష్ జాదవ్, అచ్చ దేవానంద్, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply