పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీవో

పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీవో
- ప్రశాంతంగా పరీక్షల నిర్వహణకు సిబ్బంది సహకరించాలి
- మాస్ కాపీయింగ్ పాల్పడితే చర్యలు
మోత్కూర్, ఆంధ్రప్రభ ; పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం నుండి ప్రారంభం కాగా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని భువనగిరి ఆర్డీవో ఎం కృష్ణారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించాలని ఆర్ డి ఓ ఆదేశించారు. ప్రశాంతంగా పరీక్షల నిర్వహణ కోసం సిబ్బంది సహకరించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ కి పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎం ఈ ఓ సత్యనారాయణ, పాఠశాల హెచ్ ఎం అరవింద్ రాయుడు లు ఉన్నారు.

