RCB vs GT | టాస్ గెలిచిన జీటీ.. హోం గ్రౌండ్‌లో గుజరాత్‌తో ఆర్సీబీ ఢీ.. !

ఇండియ‌న్ ప్రీమియ‌ల్ లీగ్ (ఐపీఎల్) 2025లో మ్యాచ్ లు హోరాహోరీగా జ‌రుగుతున్నాయి. ఒకవైపు చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్‌లు, మరోవైపు ప్రత్యర్థి జట్టుపై పూర్తిగా ఆధిపత్యంతో చిత్తు చేసే మ్యాచ్‌లు, ఇలా ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఉత్కంఠభరితమైన వాతావరణంలో జరుగుతున్నాయి.

కాగా, నేడు మరో థ్రిల్లింగ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి… రెండో మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు చెపాక్‌లోనే చెక్ పెట్టిన‌ ఆర్‌సిబి… మూడో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడేందుకు సిధ్ద‌మైంది.

ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో, బెంగళూరు హోమ్ గ్రౌండ్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆర్‌సిబి ముందుగా బ్యాటింగ్ చేస్తుంది.

తుది జ‌ట్లు

గుజరాత్ టైటాన్స్ : శుభమన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీప‌ర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్

ఇంపాక్ట్ ప్లేయర్ :

గుజరాత్ టైటాన్స్: అనూజ్ రావత్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, మహిపాల్ లోమ్రోర్, వాషింగ్టన్ సుందర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్, మనోజ్ ఎస్ భాండాగే, రసిఖ్ సలామ్, సుయాష్ శర్మ

జట్ల విషయానికి వస్తే..

ఆర్సీబీలో జోష్ హాజిల్‌వుడ్‌తో పాటు పేస్ విభాగంలో భువనేశ్వర్, యష్ దయాల్ ఉన్నారు. కృనాల్, సుయాష్ శర్మ స్పిన్ బాధ్యతలను నిర్వహిస్తారు. బ్యాటింగ్‌లో, కింగ్ కోహ్లీతో కలిసి ఫామ్ లో ఉన్న కెప్టెన్ రజత్ పాటిదార్ మరొసారి విరుచుకుపడితే ఆర్సీబీ భారీ స్కోరు సాధిస్తుంది.

రబాడతో పాటు, పరిధిన్ కృష్ణ, సిరాజ్ రెండు వైపుల నుండి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. స్పిన్ కోసం రషీద్ ఖాన్‌తో పాటు వాషింగ్టన్ సుందర్‌ను తీసుకుంటారో లేదో చూడాలి. అయితే, బ్యాటింగ్‌లో గుజరాత్ బలంగా కనిపిస్తోంది. గిల్, బట్లర్, సాయి సుదర్శన్ మరోసారి మెరిస్తే.. గుజరాత్ జట్టుకు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే సామర్థ్యం ఉంది.

ఐపీఎల్ టోర్నమెంట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – గుజరాత్ టైటాన్స్ 5 హెడ్-టు-హెడ్ మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఈ 5 మ్యాచ్‌లలో, ఆర్‌సిబి 3 మ్యాచ్‌లలో గెలిచింది, జిటి 2 సార్లు గెలిచింది. దీంతో నేటి మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా మారింది.

Leave a Reply