రాష్ట్ర మంత్రి బీసీ.జనార్ధన రెడ్డిని కలిసిన మాజేరు పెద్దలు…

రాష్ట్ర మంత్రి బీసీ.జనార్ధన రెడ్డిని కలిసిన మాజేరు పెద్దలు…

చల్లపల్లి – ఆంధ్రప్రభ : రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ.జనార్దన రెడ్డిని మాజేరు గ్రామ పెద్దలు కలిసి గుండేరు వంతెనపై పూర్తి శిథిలావస్థకు చేరుకున్న వంతెన పరిస్థితి తెలియచేసి నూతన వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

మాజేరు గ్రామానికి చెందిన టీడీపీ రాష్ట్ర నాయకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ ద్వారా మంత్రిని కలిశారు. బొర్రా అగ్గిరాముడు, కొనకళ్ల రెడ్డెమ్మ, తిరుమలశెట్టి రామారావు, కమ్మిలి పెదబాబు, తుమ్మలగుంట గోపాలకృష్ణ, కల్లేపల్లి లక్ష్మీనారాయణ, బండి నాగార్జున లు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

Leave a Reply