ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు..

ఖమ్మం, ఆంధ్రప్రభ : పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు,ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు, ఆకాంక్షలన్నీ నెలవేరాలని ఆకాంక్షించారు.

కొత్త సంవత్సరంలో సమృద్ధిగా వానలు కురిసి,రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని, అభిలషించారు..షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే పరాభవ నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు,ఆనందాలు నిండాలి,ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకుకోవాలని ఆకాంక్షించారు.

Leave a Reply