Ravi Teja | భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ రివ్యూ..

Ravi Teja | భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ రివ్యూ..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి(Latest movie appeals to husbands and tycoons). ఈ సినిమాని కిషోర్ తిరుమల తెరకెక్కించారు. మాస్ హీరో.. క్లాస్ డైరెక్టర్ కలిసి ఈ మూవీ చేయడంతో.. ఈ కుటుంబ కథా చిత్రం ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. సంక్రాంతికి ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ థియేటర్స్ లోకి వస్తుంది. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి.. ట్రైలర్ ఎలా ఉంది..? ఈ సినిమా అయినా రవితేజకు సక్సెస్ అందించేనా..?
Ravi Teja | ఫ్యామిలీతో చూసే సినిమా..

భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ట్రైలర్ 2.19 నిమిషాల ఉంది. ఈ ట్రైలర్ లో పెద్దగా సస్పెన్స్ ఏమీ లేకుండా.. కథ ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేసారు. ఓ పెళ్లైన మగాడు, మరో అమ్మాయి ప్రేమలో పడటం, ఆ తర్వాత వచ్చే సంఘటనలు వలన ఇద్దరి ఆడాళ్ల నడుమ ఆ మగాడు ఎలా నలిగిపోయాడనే అనే పాయింట్ తో తెరకెక్కించిన సినిమా ఇది. అలాగే ఇందులో ఎంటర్ టైన్మెంట్ తో పాటు బంధాలు.. అనుబంధాలు గురించి కూడా చూపించినట్టు తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. పండగకి ఫ్యామిలీతో కలిసి చూసేలా తీసిన పర్ ఫెక్ట్ మూవీ అనిపిస్తుంది.
Ravi Teja | ఎనర్జీ.. ఎమోషన్ వేరే లెవల్..

రవితేజ గురించి చెప్పాలంటే.. ఈ సినిమాలో రవితేజ తన రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ లో రవితేజ ఎనర్జీ, ఎమోషన్ వేరే లెవల్లో ఉన్నాయి. డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ గ్లామర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అనిపిస్తోంది. సత్య, వెన్నెల కిషోర్, సునీల్, మురళీధర్ గౌడ్ కామెడీ కూడా వర్కవుట్ అయ్యేలా ఉంది. ఈ సినిమాకి తగ్గట్టుగా భీమ్స్ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయింది. ట్రైలర్ తో అయితే మెప్పించారు.. ఇక థియేటర్స్ లో సినిమాతో కూడా మెప్పిస్తే.. మాస్ రాజాకు క్లాస్ డైరెక్టర్ హిట్ ఇచ్చినట్టు అవుతుంది. మరి.. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

