ఆల‌యంలో రావాడ చంద్ర‌శేఖ‌ర్‌కు ఘ‌న‌స్వాగతం

(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడ (Vijayawada) లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాతను కేరళ రాష్ట్ర డీజీపీ రావాడ చంద్రశేఖర్ మంగ‌ళ‌వారం దర్శించుకున్నారు. తెలుగువాడైన కేరళ రాష్ట్ర డీజీపీ రావాడ చంద్ర‌శేఖ‌ర్ (Kerala DGP Rawada Chandrasekhar) ఆలయానికి రాగా కార్యనిర్వహణ అధికారి శీనానాయక్, పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు.

కనకదుర్గమ్మ (Kanaka Durgamma) కు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంత‌రం అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను ఈవో చైర్మన్లు అందజేశారు. కార్యక్రమాల పట్ల డీజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు.

Leave a Reply