Ration cards | కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం మంత్రి ప్రచారం…

Ration cards | కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం మంత్రి ప్రచారం…
Ration cards | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : గొల్లపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ముస్కూ దీప్తి నిశాంత్ రెడ్డి గెలుపు కోసం మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ సోమవారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులు మంజూరుతో నిరుపేదల కళ్ళల్లో ఆనందం కనబడుతుందన్నారు. రెండు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ బావుటా ఎగురవేసిందన్నారు.
మూడో విడత కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పారు. గొల్లపల్లిలో ముస్కూ నిశాంత్ రెడ్డి సతీమణి దీప్తి సర్పంచి పదవి కోసం పోటీ చేస్తుండగా గ్రామ ప్రజలందరూ టూత్ పేస్ట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మంత్రి కోరారు. దీప్తిని గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ చెప్పారు.
