LESBIN| అలా న‌టిస్తున్నావా..?

LESBIN| అలా న‌టిస్తున్నావా..?

లెస్బిన్ పాత్ర‌లో ర‌ష్మిక‌
కాక్ టెయిల్ 2 మూవీలో డిఫ‌రెంట్ రోల్‌
కృతి సనన్, రష్మిక ఇద్దరూ స్వలింగ ప్రేమికులుగా..
హీరోగా షాహిద్ కపూర్

LESBIN| ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకంటే వైవిధ్యమైన కథలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. హీరో హీరోయిన్లు కూడా డిఫ‌రెంట్ మూవీల్లో న‌టించ‌డానికి ఎక్కువ ప్రాధాన్య‌తనిస్తున్నారు. అయితే నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న ఓ డిఫ‌రెంట్ రోల్‌లో న‌టించ‌బోతున్న‌ట్లు తెలిసింది. తాజాగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న కాక్ టెయిల్ 2 గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్లుగా కృతి సనన్, రష్మిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. ఈ సినిమాలో కృతి సనన్, రష్మిక ఇద్దరూ స్వలింగ ప్రేమికులుగా (లెస్బియన్ క్యారెక్టర్స్) కనిపించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కథ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది. రష్మిక లాంటి స్టార్ హీరోయిన్ లెస్బియన్ పాత్ర చేస్తుందన్న వార్త మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలీవుడ్‌లో అప్పుడప్పుడు ఇలాంటి సబ్జెక్ట్స్ టచ్ చేసినా.. దక్షిణాదిలో మాత్రం స్టార్ హీరోయిన్లు ఇలాంటి పాత్రలు చేయడం అరుదు. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే.. రష్మిక కెరీర్‌లో ఇది అతిపెద్ద ప్రయోగంగా నిలవనుంది.

ఈ సినిమాకి హోమీ అదజానియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల జనవరి 31న షూటింగ్ పూర్తయినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమా తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని దర్శకుడు పేర్కొనగా, విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అలాగే షాహిద్ కపూర్ ఇందులో ఇప్పటివరకు చూడని డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారం. 2012లో విడుదలైన కాక్ టెయిల్ (Cocktail)కు ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది. ఆ సినిమాలో దీపిక పదుకొణె, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Leave a Reply