Rashiphalalu | నేటి రాశిఫలాలు – 11.06.25

11-6-25

మేషం…ప్రయాణాలు రద్దు. అనారోగ్యం. ముఖ్య పనుల్లో అవరోధాలు. బందువులతో తగాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలలో  ఒడిదుడుకులు. ఉద్యోగాలలో అయోమయ పరిస్థితి.

వృషభం….కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో సంభాషణలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలలో   అంచనాలకు తగిన లాభాలు. ఉద్యోగాలలో శుభవర్తమానాలు.

మిథునం...రాబడి కొంత తగ్గే అవకాశం. విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు ముందుకు సాగవు. మిత్రులతో స్వల్ప విభేదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

కర్కాటకం..పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు.  కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు , ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

సింహంముఖ్యమైన పనుల్లో మందగమనం.  అనారోగ్యం. ప్రయాణాలు రద్దు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. కష్టానికి  ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలలో స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

కన్య…..నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలలో లాభాలు దక్కే అవకాశం. ఉద్యోగాలలో  ముఖ్యమైన మార్పులు.

తుల…..పరిచయాలు పెరుగుతాయి. మీ ఆశయాలు నెరవేరే సమయం.  ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.  ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృశ్చికం..కుటుంబంలో ఒత్తిళ్లు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. బంధువులతో కొన్ని వివాదాలు .ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే. ఉద్యోగాలలో నిరాశ తప్పదు.

ధనుస్సు….పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువర్గంతో విభేదాలు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలలో మరింత జాగ్రత్తలు వహించాలి.  ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. అనారోగ్యం.

మకరం…..కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ముఖ్యమైన చర్చల్లో పురోగతి కనిపిస్తుంది. ఆస్తిలాభం. వ్యాపారాలలో సత్తా చాటుకుంటారు. ఉద్యోగాలలో అనుకూలత.

కుంభంపనులు సకాలంలో పూర్తి. బంధువులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. దైవదర్శనాలు.

మీనంకుటుంబంలో ఒత్తిడులు. కొన్ని పనులలో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *