Kurnool | ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో అరుదైన చికిత్స

  • చాతిలో నాలుగు కేజీల కణితి
  • శస్త్ర చికిత్స ద్వారా తొలగింపు


కర్నూల్ బ్యూరో : ఓ మహిళ ఛాతిలో నాలుగు కేజీల కణితిని గుర్తించిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అరుదైన ఆపరేషన్ ద్వారా తొలగించారు. ఈ ఆపరేషన్ వివరాలను శనివారం హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. దాసరి బేబీ అనే 40ఏళ్ల మహిళ జొన్నగిరి డోన్ మండలం నివాసం.. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాలేజీలో స్వీపర్ గా పనిచేస్తుంది.. ఆమెకు భర్త లేడు.. కష్టపడి బతుకుతున్న ఆమెకు అకస్మాత్తుగా ఓ కష్టం వచ్చింది. విపరీతమైన దగ్గు.. ఊపిరి ఆడేది కాదు.. దీంతో ఆమె కర్నూలు జీజీహెచ్ హాస్పిటల్లో వైద్యులను సంప్రదించింది. పరిశీలించిన వైద్యులు ఆమెను గుండె ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స విభాగానికి రెఫర్ చేసారు.

పరీక్షలు చేయగా ఆమె ఛాతిలో పెద్ద గడ్డ ఉన్నట్లు గుర్తించారు. అది ఎంత పెద్దగా ఉంది అంటే ఎడమవైపు ఛాతినంతా ఆక్రమించి గుండెను కూడా కుడివైపున‌కు తోసేసింది.. రక్తనాళాలను వాయునాళాన్ని కూడా గట్టిగా ఒత్తేస్తుంది దాని వలన ఆమెకు సమస్యలు వచ్చాయి. ఈమెకు ఎక్స్రే, సిటీ స్కాను, ఎమ్మారై లాంటి పరీక్షలు చేసి జాగ్రత్తగా ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. కానీ అంత పెద్ద గడ్డను ఎలా తీయగలమో ఏమైనా సమస్య వస్తుందా అని కొంచెం ముందు వెనక ఆలోచించి పేషంట్ కు ధైర్యం చెప్పి ఆపరేషన్ పూనుకున్నారు.

ఎందుకంటే ఇది చాలా ఖరీదైన ఆపరేషన్, ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లే స్తోమత ఆమెకు లేదు. ఎన్టీఆర్ వైద్య సేవలో కూడా కొంత డబ్బుతో చేయ వచ్చని గ్రహించిన వైద్యులు ఈనెల 22న ఈమెకు ఈ క్లిష్టమైన ఆపరేషన్ చేసి గడ్డను పూర్తిగా తొలగించడం జరిగింది. పేషెంట్ కొంచెం రికవరీ కష్టమైనా కానీ బాగా కోలుకొని డిశ్చార్జ్ చేయడానికి రెడీ అయింది. ఎన్టీఆర్ వైద్యసేవ అనే ఈ పథకం చాలా మంది పేదలకు ఉపయోగపడుతూ ఉంటుంది. దీనివలన ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూల్ లో ప్రతి నెలా 15మంది దాకా పెద్ద బైపాస్ ఆపరేషన్లు చేయించుకొని సంతోషంగా ఇళ్లకు వెళుతూ ఉండడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *