గిరిజన మైనర్ బాలికపై అత్యాచారయత్నం

గిరిజన మైనర్ బాలికపై అత్యాచారయత్నం
- ఫోక్సో చట్టం కింద కేసు నమోదు
- ఒక్కరు బ్యాంకు ఉద్యోగి, మరొకరు విద్యార్థి
- ఉప్పునుంతల ఎస్సై వెంకట్ రెడ్డి
అచ్చంపేట, ఆంధ్రప్రభ: గిరిజన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఉప్పునుంతల మండలంలోని ఓ గ్రామంలో కలకలం రేపింది. ఉప్పునుంతల ఎస్సై వెంకట్ రెడ్డి కథనం ప్రకారం ఉప్పునుంతల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక బుధవారం అందాజా అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ గ్రామంలో జరుగుతున్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలోని సాంస్కృతిక కార్యక్రమాలలో తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నది.
దాహాన్ని తీర్చుకొనుటకు సమీపంలో ఉన్న తన ఇంటికి వెళ్లి దాహార్తిని తీర్చుకొని తల్లిదండ్రులకు కూడా తాగేందుకు నీరు తీసుకొని తిరిగి గుడికి వెళుతుంది.ఈ నేపధ్యంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బాధిత మైనర్ అమ్మాయి చేతి పట్టుకొని చీకట్లోకి లాగుకెళ్ళి అత్యాచారయత్నానికి పాల్పడ్డారని తెలిపారు.

ఘటనకు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులపై ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తులలో ఒకరు బల్మూర్ మండల కేంద్రంలోని ఒక బ్యాంక్ లో విధులు నిర్వర్తిస్తుండగా, మరొకరు విద్యార్థి అని, బాలిక తల్లిదండ్రులు అంటున్నారు. తమ కూతురుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ పై వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలిని మైనర్ బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.

