తనను గెలిపించి..

తనను గెలిపించి..
- సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసుకోవాలి
అమనగల్లు, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీలోని 12వ వార్డ్ లో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి చుక్క అల్లాజీ గౌడ్ ప్రచారం నిర్వహించారు. వార్డులోని ఓటర్లను కలుస్తూ వార్డు సమస్యలు తెలుసుకున్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే వార్డు లోని సమస్యలను శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని చుక్క అల్లాజిగౌడ్ ఓటర్లకు హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలోని 12వ వార్డులో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులతో కలిసి అభ్యర్థి చుక్క అల్లాజిగౌడ్ ఇంటింటి విస్తృత ప్రచారం నిర్వహించారు.
2వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానన్నారు. ప్రజలను ఆప్యాయంగా పలకరించి, ఓటర్ల మద్దతు కోరారు. ఆయన వెంట ప్రచారంలో బీజేపీ నాయకులు తాళ్ల జగన్, నాగిళ్ల బుచ్చయ్య, దూసగంటి యాదయ్య, గోజే నందు, వెంకటేష్ ,హరి, సందీప్, పల్లె శ్రీధర్, శ్రీనివాస చారి, గిరి, ప్రభాకర్, నరేష్, శ్రీను, మనోజ్, సాయి, మధు, బాలమణి, యాదమ్మ, శోభ, నాగమ్మ, రాణి, పద్మా, శిరీష, తదితరున్నారు.
