Random check | నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి

Random check | నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
- ఏపీ మోడల్ స్కూల్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్
Random check | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్‌ను ఈ రోజు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్‌ను స్వయంగా పర్యవేక్షించారు. బోధన విధానం, పాఠ్యాంశాల అమలును గురించి విద్యార్థులకు ప్రశ్నలు సమాధానాలు తెలిపారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి కలెక్టర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను ఆమె సన్మానించారు.

జిల్లాలోని 281 పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం ప్రతి ఒక్క పాఠశాలకు అధికారులను నియమించాలన్నారు. వంద రోజుల ప్రణాళిక అమలులోభాగంగా నిరంతర సమీక్ష నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా కలెక్టర్‌కు కేటాయించిన ఏపీ మోడల్ స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థుల అభ్యాసన పద్ధతులు, బోధన విధానం, పాఠ్యాంశాల అమలును పరిశీలించారు. మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
