ఇఫ్తార్ విందు.. హాజరైన సర్పంచులు..

ఇఫ్తార్ విందు.. హాజరైన సర్పంచులు..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతికని దుబ్యాల సర్పంచ్ సంగీ అంజలి, మందరోనిపల్లి సర్పంచ్ మారం అర్చన, మాజీ ఎంపిటిసి ఫోరం మండల అధ్యక్షుడు సంగి రవి అన్నారు. ఈ సందర్భంగా టేకుమట్ల మండలంలోని దుబ్యాల మందరోనిపల్లి గ్రామంలో ముస్లిం సోదరులు ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో వారు పాల్గొన్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. రంజాన్ పండుగ వారి జీవితాలలో సుఖసంతోషాలను నింపాలని ఆ అల్లాహ్ ను కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఆ గ్రామాల ఉపసర్పంచ్లు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply