Rammohan Reddy | అక్షర జ్యోతిని వెలిగించిన ఆదర్శ మూర్తి సావిత్రిబాయి

Rammohan Reddy | అక్షర జ్యోతిని వెలిగించిన ఆదర్శ మూర్తి సావిత్రిబాయి
Rammohan Reddy | మక్తల్, ఆంధ్రప్రభ : అజ్ఞాన అంధకారాన్ని చీల్చి బడుగుల జీవితాల్లో అక్షరజ్యోతిని వెలిగించిన ఆదర్శమూర్తి.. సమాజ సంకెళ్లను తెంచి స్త్రీ విద్యకు శాశ్వత బాట వేసిన అపర సరస్వతి సావిత్రిబాయి పూలే అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కొనియాడారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని తన నివాసంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే చిట్టెం సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్యపరిచిన చైతన్యశీలి.. అపహాస్యాన్ని, అవమానాన్ని ధైర్యంగా ఎదురించి సమానత్వానికి స్వరంగా మారిన ధీశాలి అని అన్నారు. విద్యనే ఆయుధంగా, జ్ఞానాన్నే విముక్తిగా మలిచిన సామాజిక శిల్పి.. దేశంలో తొలి బాలికల పాఠశాల స్థాపించిన తొలి మహిళా ఉపాధ్యాయిని, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజ మార్పు సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి .నరసింహ గౌడ్, బీఆర్ఎస్ మక్తల్ పట్టణ అధ్యక్షులు చిన్న హన్మంతు, నాయకులు పసుల విష్ణువర్ధన్ రెడ్డి, అన్వర్ హుస్సేన్, మన్నాన్, నేతాజీ రెడ్డి, ఈశ్వర్ యాదవ్, మొగులప్ప, జె.సాగర్, ఎలిగండ్ల బాలప్ప, చందాపూర్ అశోక్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
