ఎర్రన్నాయుడికి రామ్మోహన్ నాయుడు నివాళి
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి, కింజరాపు ఎర్రంనాయుడు(Kinjarapu Errannayudu) 13వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఘన నివాళులు అర్పించారు. తొలుత శ్రీకాకుళం నగరంలోని ఎనభై అడుగుల రహదారిలో విగ్రహానికి, కోడి రామూర్తి మైదానం సమీపంలోని ప్రజా సధన్ వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్(Collector Swapnil Dinkar Pundkar), శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు పాల్గొన్నారు. అక్కడి నుంచి నిమ్మాడ చేరుకున్న రామ్మోహన్ నాయుడు..
రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తో కలసి ఎర్రన్న ఘాట్ కి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, బగ్గు రమణమూర్తి(Baggu Ramanamurthy), మాజీ మంత్రి నేతలు గౌతు శ్యామ సుందర శివాజీ, కింజరాపు హరివర ప్రసాద్, కింజరాపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

