రాంజీ గోండు పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి

జైనూర్, ఆంధ్రప్రభ ; ఆనాటి కాలంలో ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేసిన ఆదివాసి తొలి పోరాట యోధుడు రాంజీ గోండు స్ఫూర్తితో హక్కుల సాధనకు ముందుకు సాగాలని జై నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుమేత విశ్వనాత్ రావు అన్నారు. గురువారం కొమరం భీ0 అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో రాంజీ గోండు 166వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాంజీ గోండు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ విశ్వనాత్ రావు మాట్లాడుతూ ఆనాటి కాలంలో ఆదివాసి యోధులు రాంజీ గోండు,కొమరం భీమ్ ఇలాంటి మహనీయులు పోరాటం వల్లనే ఆదివాసులకు హక్కులు కలిగాయని అన్నారు. నేడు ప్రభుత్వాలు ఆదివాసీలకు అడవికి దూరం చేసే విధంగా టైగర్ జోన్ బఫర్ జోన్ పేరట ఆదివాసులకు ఇబ్బందులు గురి చేయడం తగదని అన్నారు.

రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులకు భంగం కలగకుండా సాధించేందుకు మహనీయుల పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మెశ్రం అంబాజీ రావు, సర్పంచులు భూపతి కుంర భీంరావు మాడవి లక్ష్మన్, మాధవ్ రావు,ఆత్రం సింధు నగేష్, ప్రకాష్, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply