Ramana Reddy | ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
Ramana Reddy | కాకతీయ, ములుగు ప్రతినిధి, ఆంధ్రప్రభ : గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి సర్పంచిగా గెలిపిస్తే.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని భూపాల్ నగర్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి నాగిడి రమణారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదివారం గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తాను అహర్నిశలు కష్టపడతానని, గ్రామంలో మిగిలిపోయిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను, అర్హులైన వారికి పెన్షన్స్, ఇందిరమ్మ ఇళ్లను ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గ్రామంలోని సమస్యలను తీర్చేందుకు అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

