ముస్లిం సోదరులకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్యాత్మికతను, క్రమశిక్షణను పెంపొదిస్తాయిని అన్నారు.
ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పలు కార్యక్రమాల ద్వారా, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు. ముస్లిం సోదరులు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించారు.