గట్టుప్పలలో ఘనంగా రంజాన్ వేడుకలు..

గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో ముస్లిం సోదరులు ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండగను ఈరోజు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ముస్లిం సోదరులందరూ కొత్త దుస్తులు ధరించి ఈద్గా మైదానానికి చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి, చిన్నలు పెద్దలు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ముఖ్య అతిథులుగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ నామని జగన్నాథం, ఉప సర్పంచ్ ఖమ్మం లక్ష్మయ్య, తేరటుపల్లి మాజీ సర్పంచ్ వీరమల్ల శ్రీశైలం, గ్రామ శాఖ అధ్యక్షులు సామల యాదయ్య,కాంగ్రెస్ నాయకులు దోర్నాల అంజయ్య, చల్లమల్ల వెంకటరమణారెడ్డి, దోర్నాల భరద్వాజ్,వార్డ్ సభ్యులు పెదగాని నరేందర్, హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వర్లు, సుదర్శన్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు విచ్చేసిన అతిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాహద్, పాషా, జలాలుద్దీన్, సోనా జానీ, ఖలీల్, నహీం, షౌకత్, ముస్తఫా,రబ్బాని,ఖాదర్, రహీం,ఇక్బాల్,అబ్బాస్, జాంగిర్ షరీఫ్, వాజిద్, ఆరిఫ్, మైనోద్దీన్, మదార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply