Rally | హెల్మెట్ ధ‌రించి.. బైక్ పై ఎమ్మెల్యే, క‌లెక్ట‌ర్

Rally | హెల్మెట్ ధ‌రించి.. బైక్ పై ఎమ్మెల్యే, క‌లెక్ట‌ర్

  • పట్టణ వీధుల్లో ప్రయాణించిన, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
  • రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి… ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి
  • జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు
  • రోడ్డు భద్రతపై విద్యార్థులు, యువత అవగాహన కలిగి ఉండాలి
  • జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

Rally | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : పోలీసు శాఖ, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నెల రోజుల జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, నాగర్ కర్నూల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుండి ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ ధరించి వాహనాల ర్యాలీని పోలీస్ స్టేషన్ నుండి శ్రీపురం చౌరస్తా , అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు.

అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో యువకులు, ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ… అజాగ్రత్తతో వాహనాలు నడపడంతో దేశవ్యాప్తంగా ప్రతి రోజుకు 3500 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. రోడ్డు భద్రత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. హెల్మెట్, సీటుబెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల ప్రాణనష్టం జరిగే ప్రమాదం అధికంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ…. ద్విచక్ర వాహనం కొనుగోలు చేసినప్పుడే తప్పనిసరిగా హెల్మెట్ కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు తీసుకురావాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రతిఒక్కరూ అవగాహన పెంపొందించుకొని రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సందర్భంగా కోరారు. ఈసందర్భంగా పాత్రికేయులకు, ప్రజలకు ఉచితంగా హెల్మెట్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా రవాణా శాఖ అధికారి చిన్న బాలు, డి.ఎస్.పి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, ఆర్టీవో నెంబర్ ఎద్దుల గోపాల్ రెడ్డి, రవాణా శాఖ అధికారులు అనుప్ రెడ్డి, మధు పోలీసు అధికారులు సంబంధిత శాఖల అధికారులు, పాత్రికేయులు యువకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply