Rally | కోటి సంతకాల సేకరణ సూపర్ హిట్

Rally | కోటి సంతకాల సేకరణ సూపర్ హిట్

  • కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ పథకం అట్టర్ ప్లాప్
  • కోటి సంతకాల ప్రతులతో వైఎస్సార్ సీపీ ర్యాలీ
  • నరసరావుపేట నియోజకవర్గలో 62,500 సంతకాలు
  • వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి

Rally | నరసరావుపేట, ఆంధ్రపభ : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన ప్రజల నుంచి సేకరించిన 62,500 వినతి పత్రాలతో వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈరోజు స్థానిక గుంటూరు రోడ్డులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా స్థానిక లింగంగుంట్లలోని పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైఎస్ జగన్, డాక్టర్ గోపిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ సూపర్ హిట్ అని, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకం అట్టర్ ప్లాప్ అని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా జరిగిందని, నరసరావుపేట నియోజకవర్గంలోని 62,500 మంది నుంచి సంతకాల సేకరణ చేసిన‌ట్లు తెలిపారు. అయ్యా…. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ ఆపమని ఈ రాష్ట్ర ప్రజల నుంచి కోటి సంతకాలు సేకరించిన‌ట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీకి ఓటు వేసిన వాళ్లే కాకుండా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కూడా సంతకాలు చేయడం విశేషం అన్నారు.

పేదవాడు కన్న కలలు కలలు గానే మిగులుతున్నాయని అన్నారు. దయచేసి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నానని, 15వ తేదీన పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి కూడా సంతకాలు చేసిన వినతి పత్రాలను పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుందని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని గోపిరెడ్డి కోరారు.

పల్నాడు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు మెడికల్ కళాశాల ప్రైవేతీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఈ రోజుకి రాష్ట్రవ్యాప్తంగా కోటి 60 లక్షల సంతకాలు సేకరించడం జరిగిందన్నారు. విజయవాడ ధర్నా చౌక్‌లో ప్రతీరోజు టీచర్లు, అంగన్వాడీలు, అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగస్తులు, డాక్టర్లు సైతం రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారని, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఉద్యమ బాట పడుతున్నారని, దీన్ని బట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేకత అర్థం అవుతుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వందలాదిమంది పాల్గొన్నారు.

Leave a Reply