ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు..

ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు..
మోత్కూర్, ఆంధ్రప్రభః ఛత్రపతి శివాజీ జయంతి ని పురస్కరించుకుని మున్సిపల్ కేంద్రం లో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు శివాజీ కండువా లు,జెండాలతో డి జె సౌండ్ తో శివాజీ చిత్రపటం తో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభం అయ్యింది. ఈ ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్ మీదుగా స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వరకు కొనసాగింది.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కోమటి మచ్చగిరి, జనార్దన్, బయ్యని రాజు,కంచర్ల క్రాంతి కుమార్, మొరిగాల శ్రీనివాస్, గౌరు శ్రీనివాస్, పోచం సోమయ్య,గుదే మధుసూదన్ ,సజ్జనం మనోహర్, ఎడ్ల రాము,పురుగుల రమేష్, గుణగంటి శ్రీధర్,చేతరాశి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
