Rajaram Reddy | సేవలు తరతరాలకు స్ఫూర్తి

Rajaram Reddy | సేవలు తరతరాలకు స్ఫూర్తి

  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Rajaram Reddy | ఎండపల్లి, ఆంధ్రప్రభ ; గ్రామ నిర్మాణానికి తన స్వంత భూములను దానం చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన గొప్ప దార్శనికుడు ఏలేటి రాజారాం రెడ్డి అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాం పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఏలేటి రాజారాం రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వంత ప్రయోజనాలను పక్కనపెట్టి గ్రామాభివృద్ధికి భూములను దానం చేసిన రాజారాం రెడ్డి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేసిన త్యాగం తరతరాలకు ఆదర్శమని అన్నారు.

రాజారాం రెడ్డి పేరు మీద చేపట్టే సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా గ్రామాభివృద్ధి పనులు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలేటి వంశస్తులు,సర్పంచ్ సంగ రమేష్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుండాటి గోపిక, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి, సర్పంచులు మారం సునీత రెడ్డి, కందికట్ల అమృత, బాలసాని శారద , ఆవుల మమత, జీ రెడ్డి మహేందర్ రెడ్డి, పడిధం లావణ్య,మాజీ ఎంపీటీసీ గాజుల మల్లేశం, ఉప సర్పంచ్ మెరుగు జాని, కోడిపెల్లి కొమురమ్మ , గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.

Leave a Reply