Rajanikanth | జైలర్ 2లో కోలీవుడ్ స్టార్

Rajanikanth | జైలర్ 2లో కోలీవుడ్ స్టార్
- అతిథి పాత్రలో విజయ్ సేతుపతి
వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajanikanth) నటిస్తున్న జైలర్ 2 (Jailer2) చిత్రంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో భాగమవుతున్నట్లు విజయ్ సేతుపతి స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజనీకాంత్ తనకు ఎంతో ఇష్టమైన నటుడని, ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పారు.

ప్రస్తుతం ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే స్క్రిప్ట్‌లలో మాత్రమే విలన్ (Vilan) లేదా అతిథి పాత్రలు చేస్తున్నానని, ఇటీవల విన్న కథలన్నింటిలోనూ ఎక్కువగా నెగెటివ్ పాత్రల కోసమే తనను సంప్రదిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇక జైలర్ 2లో మోహన్‌లాల్, షారుక్ ఖాన్, శివరాజ్‌కుమార్ లు కూడా అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సినిమాను జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

