ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసారి ప్రభాస్ థ్రిల్లర్ జోనర్‌లో ఒక స్పెషల్ కమర్షియల్ ఎంటర్టైనర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. సినిమాలో థ్రిల్లింగ్ సీక్వెన్సెస్, గూస్‌బంప్స్ ఇచ్చే సీన్స్‌తో పాటు కామెడీ, ఎంటర్టైన్‌మెంట్ కూడా పుష్కలంగా ఉండనున్నాయని సమాచారం. దీనికి తోడు ఎస్.ఎస్. థమన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోనుందని, స్క్రీన్‌పై మ్యూజిక్ ఎఫెక్ట్స్ కూడా గూస్‌బంప్స్ ఇవ్వడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.
అయితే, మొదట రాజా సాబ్ 2025 సమ్మర్‌లో విడుదల కావాల్సి ఉండగా, తర్వాత దసరా సీజన్‌కి వస్తుందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్ 5న రిలీజ్‌గా ఫిక్స్ చేసినప్పటికీ, ఇప్పుడు ఆ తేదీని మార్చి జనవరి 9, 2026 సంక్రాంతికి వాయిదా వేశారు. రిలీజ్ డేట్ విషయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి కొంత గందరగోళం కనిపించినా, సరైన టైమ్‌ను దృష్టిలో పెట్టుకొని పెద్ద టార్గెట్‌తో ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు.
నార్త్ లో భారీ క్రేజ్..
ఈ సినిమాకి నేరుగా 1000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారని టాక్. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నార్త్ సైడ్ రెబల్ స్టార్ అభిమానులు ప్రభాస్ కొత్త అవతారాన్ని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి 2తో మొదటిసారి 1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ప్రభాస్, గత ఏడాది కల్కి 2898 ADతో మరోసారి 1000 కోట్ల మార్క్‌ను దాటాడు. ఇప్పుడు రాజా సాబ్తో హ్యాట్రిక్ కొడతాడా అనే ఆసక్తి సినీ పరిశ్రమలో అలాగే అభిమానుల్లోనూ కనిపిస్తోంది.