Raj KC Reddy | ఏపీ మద్యం కుంభకోణం.. అతనే ఆర్కిటెక్ట్

Raj KC Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి మొత్తం వ్యవహారానికి ఆర్కిటెక్ట్ అని కీలక వ్యాఖ్యలు చేసింది. కెసిరెడ్డి వేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణకు సీజేఐ ధర్మాసనం నిరాకరించింది. దీంతో పిటిషన్ వెనక్కి తీసుకుంటామని కెసిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ధర్మాసనం అనుమతించింది.
