ఘనంగా హోలీ సంబరాలు..

ఘనంగా హోలీ సంబరాలు..

రాయపోల్, ఆంధ్రప్రభ : మండల కేంద్రం రాయపోల్‌తో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో హోలీ పండుగను ప్రజలు బుదవారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే యువత,చిన్నారులు రంగులతో ఒకరిపై ఒకరు చల్లి హర్షోల్లాసాలతో సందడి చేశారు.గ్రామ వీధులన్నీ రంగుల మయం కాగా, పండుగ సందడి నెలకొంది. కామదాహనం కార్యక్రమాన్ని సోమవారం రాత్రి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.గ్రామ పెద్దలు,యువకులు పాల్గొని చెడు పై మంచి గెలుపుకు సంకేతంగా కామ దహనం చేశారు. అనంతరం ప్రజలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పండుగ సందర్భంగా సహజ రంగులు ఉపయోగించాలని, రసాయనిక రంగులను నివారించాలని గ్రామ పెద్దలు సూచించారు. మొత్తానికి రాయపోల్ మండలంలో హోలీ సంబరాలు శాంతియుత వాతావరణంలో, ఉత్సాహంగా ముగిశాయి.

Leave a Reply