ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వద్దన్నా రోజూ సాయంత్రం వరుణ దేవుడు వచ్చేస్తున్నాడు. ఇదేం వానరా బాబు.. అన్నట్లు వాన దంచికొడుతోంది. వరుణుడి ప్రకోపానికి తెలుగు రాష్ర్టాల ప్రజలు వణికిపోతున్నారు. ఇళ్ల నుంచి పనుల నిమిత్తం బయటకు రావడానికి భయపడిపోతున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ (Department of Meteorology) హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ…
అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మూడు రోజుల పాటు వర్షాలు (rains) కురుస్తాయని పేర్కొంది. అమరావతి (అమరావతి) వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉత్తర అంతర కర్ణాటక – పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతున్నది.. దక్షిణ కోస్తాంధ్ర ప్రదేశ్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1 .5నుండి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతున్నది. వాయవ్య బంగాళాఖాతం – సరిహద్దు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 13 వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముంది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:-
శనివారం, ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-
శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు, మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:-
శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.