rain| నాలుగు రోజుల పాటు వర్షాలు

rain| నాలుగు రోజుల పాటు వర్షాలు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వడగళ్ల వానలు కురుస్తాయని.. ఇప్పటికే ఖమ్మం, వికారాబాద్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. రానున్న గంటల్లో సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు, నాగర్‌కర్నూల్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జిల్లాల్లో గాలివానల వల్ల చెట్లు విరిగిపడే ప్రమాదం ఉందని, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
