ఆంఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)ను వర్షం వదలడం లేదు. రెండు రోజులుగా జోరుగా వాన (rain) కురుస్తోంది. గురువారం తెల్లవారుజాము నుంచి మళ్లీ పలు ప్రాంతాల్లో చిరుజల్లులు మొదలయ్యాయి. ఆ తర్వాత క్రమంగా వాన పుంజుకుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బంజారాహిల్స్(Banjara Hills), జూబ్లీహిల్స్(Jubilee Hills), పంజాగుట్ట(Panjagutta), ఖైరతాబాద్ (Khairatabad), మాసబ్‌ట్యాంక్, లక్డీకపూల్ వంటి చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. అలాగే ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్(Dilsukhnagar), మలక్‌పేటలోనూ వాన పడింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయంగా మారాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయ్యింది. కాగా, బుధవారం రాత్రి హయత్‌నగర్, వనస్థలిపురం, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట సహా మరికొన్ని చోట్ల వర్షం కురిసింది.