హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. వాతావరణంలో మార్పుల కారణంగా నగరంతో పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసుఫ్ గూడ, మాదాపూర్, కొండాపూర్, కూకట్ పల్లి, మియాపూర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి, మూసాపేట, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరి ఏరియాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజులుగా నగరంలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం రావడంతో నగర వాసులు ఆనందం వ్యక్తం చేశారు.
RAIN | హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం
