ఏపీకి వర్ష సూచన

ఏపీకి వర్ష సూచన

బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావం వలన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేశారు. విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలియచేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అలాగే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల దగ్గర ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు.

Leave a Reply