Railway station | అక్కడ అన్నీ సమస్యలే..!

Railway station | అక్కడ అన్నీ సమస్యలే..!
- అనేక అవస్థలు పడుతున్న విద్యార్థులు
- అధ్వానంగా మరుగుదొడ్లు
- వ్యాధులతో సతమతం
Railway station | ఏలూరు ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ : అధికారుల నిర్లక్ష్యంతో వసతి గృహాల్లో సౌకర్యాల లేమితో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వాటి ఆలనా పాలనను పూర్తిగా విస్మరించడంతో అక్కడ పరిస్థితి దయనీయ నెలకొంది. అసౌకర్యాల నడుమ పలు హాస్టల్స్(Hostels) ప్రస్తుతం కొట్టిమిట్టాడుతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో విద్యార్థులు, నిర్వాహకులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
Railway station | వసతి గృహాలలో సౌకర్యాల లేమి..


జిల్లా కేంద్రమైన ఏలూరు లోని ఎస్సీ బాలుర, బాలిక వసతి గృహం దుర్భర స్థితిలో ఉంది. భవనం శిథిల స్థితికి చేరుకుంది. శ్లాబు పెచ్చులు ఊడిపోయి విద్యార్థులపై పడుతున్నాయి. అసలే చలికాలం కావడంతో పిల్లలు చలికి వణుకుతున్నారు. డార్మెటరీ(Dormitory)లోకి వర్షపు నీరు చేరుతుండడంతో వారు రాత్రుళ్లు కంటిమీద కునుకు లేకుండా తెల్లవార్లు జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
దోమలు విషపురుగులు, కీటకాల నుంచి కాపాడుకోవడానికి విద్యార్థులు అనేక వ్యయప్రయాసలు పడుతున్నారు. వరండాలో నిర్వాహకులు (వార్డెన్, సిబ్బంది) కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా విద్యార్థుల అవస్థలను తగ్గించే ప్రయత్నాలు చేయడం లేదు.
Railway station | అశుభ్రత వాతావరణంలో భోజనం..
వసతిగృహం ప్రాంగణం పిచ్చి మొక్కలతో, చుట్టూ బురద, వ్యర్ధాల మురుగు కాలువాలతో ఉండడంతో వర్షపు నీరంతా రోజుల తరబడి లోపలే నిల్వ ఉండిపోతుంది. దీంతో వసతి గృహాం(Hostel) పందులు విషపురుగులు, ప్రమాదకరమైన పాములతో పాటు అనేక జంతువులు హాస్టల్ ఆవరణంలోకి రావడంతో విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు.
బురదనీటిని తప్పించుకొని మరుగుదొడ్డి(toilet)కి వెళ్ళాలన్నా, హాస్టల్ నుంచి బయటకు, లోపలికి తిరగాలన్నా అష్టకష్టాలు పడాల్సిందే. ప్రస్తుతం ఈ వసతిగృహంలో సుమారు 70 మంది విద్యార్థులు(70 students) ఉంటున్నారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను త్వరగా ఏర్పాటుచేయాలని పలువురు కోరుతున్నారు.
Railway station | కనీస సౌకర్యాలు కరువు..

ఏలూరులోని రైల్వే స్టేషన్(railway station) సమీపంలో ఉన్న కళాశాల బాలుర వసతి గృహంలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తాగునీరు కరువు, ఆహారంలో నాణ్యత ఉండదు, దోమల నివారణకు చర్యలు శూన్యం. వంట గదిలో శుభ్రంగా లేక అక్కడ విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు.
ఇంకా మరుగుదొడ్లు విషయానికొస్తే అశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లకు విద్యార్థులు వెళ్లాలంటే అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరుగుదొడ్లకు తలుపులు లేక సిబ్బంది శుభ్రపరచక ఎన్నిసార్లు వార్డెన్‌కు ఈ సమస్యలపై విద్యార్థులు విన్నవించుకున్నా చర్యలు మాత్రం శూన్యంగానే ఉన్నాయి.
