Railway station | ఎంపీ తెన్నేటి తనిఖీ..

Railway station | ఎంపీ తెన్నేటి తనిఖీ..

Railway station | బాపట్ల ఆంధ్రప్రభ : ప్రతి నెల రైల్వే స్టేషన్ తనిఖీల్లో భాగంగా బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ బాపట్ల రైల్వే స్టేషన్ ను శనివారం తనిఖీ చేశారు. ముందుగా రైల్వేస్టేషన్ ఆవరణలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కాజోడ్ మాల్ మీనా ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఎంపీ తెన్నేటి నివాళులర్పించారు. రైల్వే స్టేషన్ లో జరుగుతున్న పునర్నిర్మాణ పనులను ఎంపీ పరిశీలించారు. సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు బ్యూటిఫుల్ బాపట్ల రైల్వే స్టేషన్ వాతావరణం కల్పించాలని అధికారులకు ఆదేశించారు.

Railway station

ఈ సందర్బంగా పత్రిక మిత్రులతో ఎంపీ తెన్నేటి మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని రైల్వే సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు. విజయవాడ గూడూరు మార్గంకు నాల్గవ లైన్ అనుమతులు మంజూరు అయినట్లు తెలిపారు. కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ కు ఈ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. బాపట్ల మార్కాపూర్, బాపట్ల నిజాంపట్నం, బాపట్ల రేపల్లె కు నూతన మార్గాలు ప్రతిపాదనలు పంపించి ఆమోద పక్రియలో ఉన్నట్లు తెలియజేశారు. బాపట్ల రైల్వే స్టేషన్ పరిధిలో అన్ని వసతులు ఉన్నాయా..? లేదా..? అని పరిశీలించడం జరిగింది అని తెలియజేశారు. ముఖ్యంగా మహిళల భద్రత చర్యలు పెంచాలన్నారు. గర్భిణీలకు, వికలాంగులు, వృదులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. నిర్లక్ష్యం చూపుతున్న ఉద్యోగుల పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఈ సందర్భంగా ఎంపీ హెచ్చరించారు.

Leave a Reply