Rahul Gandhi Fire on ECI : అసత్యంపై సత్యం పోరాటం

Rahul Gandhi Fire on ECI : అసత్యంపై సత్యం పోరాటం

ఎన్నికల సంఘం చట్టాన్ని వీడింది

ఓట్ల దొంగలకే ప్రాధాన్యం

ఆధారాలెన్నో ఉన్నాయి

కొత్త చట్టాల్ని మారుస్తాం

అధికారం శాశ్వతం కాదు

సత్యమేంటో జనం చూపిస్తారు

రామ్​ లీలా ర్యాలీలో రాహుల్​ గాంధీ

( ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ )

భారత రాజకీయాల్లో సత్యం, అసత్యం  మధ్య యుద్ధం (Struggle)  జరుగుతోందని, అధికారం కోసం ఓట్లు చోరీ చేసిన ప్రభుత్వం గద్దె దిగాలని కాంగ్రెస్​ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi Fire on ECI)  అన్నారు.  ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో (Vote Chori)   ఓట్ల చోరీ ర్యాలీలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్​  పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  తీవ్ర స్థాయిలో భారత ఎన్నికల సంఘం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష (Rahul Fired on ECI) దాడికి దిగారు. 

Rahul Fire On ECI

Rahul Gandhi Fire on ECI

ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు, సంస్థాగత పక్షపాతం.  రాజ్యాంగాన్ని బలహీనపరిచే  ప్రయత్నం జరిగిందని (Rahul Gandhi Fire on ECI) ఆరోపించారు. రాం లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో రాహుల్​ గాంధీ మాట్లాడుతూ,  ప్రస్తుత రాజకీయ క్షణాన్ని సత్యం, అసత్యం మధ్య  పోరాటంగా జరుగుతోందన్నారు. . మతపర తాత్విక అంశాలను,  ఇతివృత్తాలను ప్రస్తావిస్తూ, భారతదేశ నాగరికత  నీతి,  – హిందూ మతం ఇతర విశ్వాసాలను దాటి – ప్రజా జీవితంలో  సత్యాన్ని కేంద్రంగా ఉంచుతుందన్నారు.

Rahul Gandhi Fire on ECI

కానీ పాలకవర్గం అధికారం కోసం ఈ సూత్రాన్ని వదిలేసిందని ఆరోపించారు. “ఈ దేశ భావజాలం, హిందూ మతం భావజాలమే కాదు,   ప్రపంచంలోని ప్రతి మతం సత్యం అత్యంత ముఖ్యమైనదని చెబుతుంది. కానీ నేడు, సత్యం కంటే అధికారాన్ని ముఖ్యమైనదిగా చేస్తున్నారు” అని ఆయన అన్నారు.

ఇక ఈసీఐని రాహుల్​ గాంధీ (Rahul Gandhi Fire on ECI) తూర్పార పట్టారు. బీజేపీ ప్రభుత్వంతో కలిసి రాజ్యాంగ సంస్థ పనిచేస్తోందని గాంధీ ఆరోపించారు. స్వతంత్ర అంపైర్‌గా (Indipendent)  పోల్ ప్యానెల్ (poll Panel)   తన పాత్రను విడిచిపెట్టి, అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల  కమిషనర్లు తమ రాజ్యాంగ స్థానాన్ని మర్చిపోవద్దని హెచ్చరించారు. “మీరు భారత ఎన్నికల కమిషనర్లు. మీరు నరేంద్ర మోదీ ఎన్నికల కమిషనర్లు కాదు.” అని రాహుల్​ గాంధీ కడిగేశారు.

Rahul Fire On ECI

Rahul Gandhi Fire on ECI

ఎన్నికల సమయంలో ఓటర్లకు లంచం ఇస్తున్నారని చెబుతూ, ప్రలోభాలు  తారుమారు చేస్తూ  ఎన్నికలను వక్రీకరిస్తున్నారని రాహుల్​ గాంధీ ఆరోపించారు. ప్రత్యక్షంగానే “ఓట్ల దొంగతనం”  (Vote Chori)  జరుగుతోందని ఆయన ఆరోపించారు.    తన వాదనలకు  ఆధారాలు ఉన్నాయని అన్నారు.   ఎన్నికల కమిషనర్లు  జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు డాక్టర్ వివేక్ జోషిల నేరుగా రాహుల్​ గాంధృ విమర్శించారు.   ఎన్నికల కమిషనర్ల నియామకం  చట్టంలో ఇటీవల చేసిన మార్పులను ప్రస్తావిస్తూ, ఎన్నికల సంఘాన్ని జవాబుదారీతనం నుండి బీజేపీని  కాపాడే  చట్టాన్ని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని గాంధీ అన్నారు. అలాంటి చట్టపరమైన రక్షణలు నిరవధికంగా కొనసాగవన్నారు.

Rahul Gandhi Fire on ECI

“మిమ్మల్ని రక్షించడానికి ఈ చట్టం చేశారు. మేము ఈ చట్టాన్ని మారుస్తాం     పూర్వస్థితికి తీసుకువస్తాం ,” అని గాంధీ అన్నారు. “మేము చర్య తీసుకుంటాం. మీకు నేడు అధికారం ఉండవచ్చు, కానీ అది పట్టింపు లేదు. ఈ దేశ ప్రజలు సత్యాన్ని అర్థం చేసుకుంటారు, సత్యం కోసం పోరాడుతారు.” అని గంభీర వదనంతో రాహుల్​ గాంధీ మాట్లాడారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Modi)  రాజకీయ (Political Faith)  విశ్వాసం క్షీణిస్తోందని ( Declining), అధికార పార్టీకి తన చర్యలు బహిర్గతమయ్యాయని  ఆయన ఆరోపించారు. “మోదీ జీ ముఖాన్ని జాగ్రత్తగా చూడండి. ఆయన విశ్వాసం ముగిసింది. ఓటు దొంగతనం పట్టుబడిందని ఆయనకు తెలుసు” అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రతి ధ్వనిస్తూ గాంధీ అన్నారు.

Rahul Gandhi Fire on ECI : కాంగ్రెస్   మాత్రమే దేశాన్ని కాపాడుతుంది

Rahul Fire On ECI

ఈ ర్యాలీలో   కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjuna Karge(  మాట్లాడుతూ,  పార్లమెంటరీ పనితీరుపై, బీజేపీ , ఆర్‌ఎస్‌ఎస్‌ల సైద్ధాంతిక దిశపై   దాడిని (Attacked)  కేంద్రీకరించారు. పార్లమెంటుకు దూరంగా ఉంటూ, ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ప్రధాని జవాబుదారీతనం (PM not Answering)  నుండి తప్పించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

Rahul Gandhi Fire on ECI

Rahul Fire On ECI

“పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు, మోడీ దేశం వెలుపల వెళ్తారు. ఆయన పార్లమెంటుకు రారు మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వరు” అని ఖర్గే అన్నారు. రాహుల్ గాంధీ ప్రశ్నలకు లేదా ప్రియాంక గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం నుండి ఎటువంటి సమాధానాలు రాలేదని ఆయన ఆరోపించారు. బీజేపీ  సైద్ధాంతిక పునాదులు భారతదేశ రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉన్నాయని ఖర్గే వాదించారు. ఎం.ఎస్. గోల్వాల్కర్ వంటి వ్యక్తులతో మనుస్మృతి వంటి గ్రంథాలతో ముడిపడి ఉన్న ఆలోచనలు దేశ ఐక్యతను లేదా ప్రజాస్వామ్య చట్రాన్ని కాపాడలేవని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మాత్రమే ఈ దేశాన్ని రక్షించగలదు” అని ఖర్గే అన్నారు, బిజెపి క్రమంగా రాజ్యాంగాన్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పేదలను అణగారిన వర్గాలను అణచివేత స్థితిలో ఉంచడానికి మతాన్ని రాజకీయ సాధనంగా ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. “హిందూ మతం హిందూత్వ పేరుతో, వారు పేదలను బానిసత్వంలో ఉంచాలనుకుంటున్నారు” అని ఆయన అన్నారు.

Rahul Gandhi Fire on ECI

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను నొక్కి చెబుతూ, కాంగ్రెస్ నాయకులు కార్మికుల త్యాగాల ద్వారా దేశ స్వాతంత్ర్యం సాధించబడిందని ఖర్గే అన్నారు. “మనకు లభించిన స్వేచ్ఛ కాంగ్రెస్ ఇచ్చింది. మోడీ దానిని ఇవ్వలేదు” అని ఆయన అన్నారు, ప్రస్తుత బీజేపీ  నాయకులు స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కూడా పుట్టలేదని అన్నారు.

బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తోందని, రాజ్యాంగ రక్షణలను క్షీణింపజేస్తోందని ఎన్నికల కమిషన్ వంటి సంస్థల స్వాతంత్ర్యాన్ని రాజీ చేస్తోందని ఆరోపించారు.

Leave a Reply