10thInvigilation | అంతా ఆన్లైన్లో..

10thInvigilation | అంతా ఆన్లైన్లో..
10thInvigilation | టెన్త్ ఇన్విజిలేషన్‌లో సమూల మార్పులు
మ్యాన్యువల్ విధానానికి స్వస్తి
ఒక్క నిమిషం ఆలస్యమైనా నో పర్మిషన్ అనుమతి లేదు
ప్రైవేట్ ఉపాధ్యాయులకు భాగస్వామ్యం
జిల్లాస్థాయిలో జరుగుతున్న అవినీతికి రాష్ట్ర ఉన్నతాధికారులు చెక్
60 సంవత్సరాలు దాటిన వారికి మినహాయింపు
పరీక్షలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో..
సిఫారసులకు చెల్లు
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కీలక మార్పులు

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రస్థాయిలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల కాలం మొదలైంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి షెడ్యూల్‌ను ప్రకటించారు. పరీక్షలలో విద్యార్థులకు ఇన్విజిలేషన్ డ్యూటీలో ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. ప్రతి ఏడాది పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు జిల్లాలోని ఉపవిద్యాశాఖ అధికారుల డీఈఓ కార్యాలయాల్లో ఉపాధ్యాయ సంఘాల సిఫారసుల మేరకు ఇన్విజిలేటర్ల నియామకాలు జరిగేవి. కానీ ఈ సంవత్సరం జరిగే పబ్లిక్ పరీక్షల్లో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులతో చర్చించారు. అందుకు తగ్గట్టుగా సమూల మార్పులు చేశారు. ప్రతి ఏడాది అధికారులు జిల్లాస్థాయిలో ఇష్టారాజ్యంగా ఇన్విజిలేటర్ల విధులను కేటాయించేవారు. ఈ ఏడాది దానికి స్వస్తి పలికారు. జిల్లాలోని మాన్యువల్ విధానానికి స్వస్తి పలికారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుల వివరాలన్నీ కూడా రాష్ట్రస్థాయిలో ఉన్నందున యూజిలేటర్ల నియామకం సాఫ్ట్వేర్ విధానంలో ఆన్లైన్లో రూపొందిస్తున్నారు.

నిబంధనలు పాటించాలి… సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు..
పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్విజిలేషన్ అంశాల్లో ముఖ్యమైన మార్పులు తీసుకొస్తోంది. దీనిలో భాగంగా ఇన్విజిలేటర్లను మాన్యువల్‌గా కేటాయించే విధానానికి స్వస్తి పల కనుంది.ఈ స్థానంలో ఆటోమేషన్ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వద్ద ఈ అంశాలపై చర్చించారు. ఈ నిర్ణయము తీసుకున్నారు. టెన్త్ పబ్లిక్ పరీక్ష లకు తొలి నుంచీ మాన్యువల్ విధానంలోనే ఇన్వి జిలేటర్లను కేటాయిస్తున్నారు. డీఈవో,ఎంఈవోల విచక్షణాధికారంతో ఇన్విజిలేటర్లను పరీక్షా కేంద్రాలకు పంపేవారు. ప్రస్తుతం మార్పుల కారణంగా ఇక నుంచి మాన్యువల్ స్థానంలో ఆటోమేషన్ విధానం తీసకొస్తున్నారు. దీనికిగాను సాఫ్ట్వేర్ కూడా రూపొందించారు. ఏ టీచర్ ను ఎక్కడకు పంపాలనేది అటోమేషన్లో భాగంగా సాఫ్ట్‌వేరే నిర్ణయిస్తుంది. ఈ విధానంలో 8 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోనె ఉపాధ్యాయులకు ఆయా పాఠశాలల సెంటర్లో ఇన్విటేషన్ డ్యూటీలు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పాఠశాల నుంచి అ దూరంలోని పరీక్ష కేంద్రానికే కేటాయిస్తారు.
అలాగే ప్రస్తుత విధానంలో ఏదైనా ఒక సబ్జెక్టు పరీక్ష ను బోధించే ఉపాధ్యాయుడికి ఆ సబ్జెక్టు టీచర్లకు ఇన్విజిలేషన్ డ్యూటీ వేయరు.ఇకపై గణితం, సైన్స్, సోషల్ అయినా గ్రూపు సబ్జెక్టులు పరీక్షలు జరిగేటప్పుడు భాషా సబ్జెక్టుల టీచర్లను..భాషా పరీ క్షలు జరిగే సమయంలో గ్రూపు సబ్జెక్టుల గణితము సైన్సు సోషల్ టీచ ర్లను ఇన్విజిలేటర్లుగా నియమించాలని నిర్ణయించారు.అలాగే అనారోగ్య సమస్యలున్న టీచర్లకు కొన్ని మినహాయింపులుంటాయి.ఈ నిబంధనల ప్రామాణికంగానే టీచర్లకు సాఫ్ట్వేర్ ఇన్విజిలేటర్ బాధ్యతలు కేటాయిస్తుంది. ఫలితంగా ఇన్విజిలే షన్ కేటాయింపు విషయంలో టీచర్లు,అధికారులు జోక్యం,నిబంధనల ఉల్లంఘనలు ఉండవని పాఠ శాల విద్యాశాఖ అధికారులు భావించి ఈ ఆదేశాలను పాటించాలని సూచించారు.

…ఇక,ఇన్విజిలేషన్ విధులకు ప్రైవేటు టీచర్లను కూడా వినియోగించాలని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించింది.టెన్త్ పరీక్షల నిర్వహణకు 33వేల మంది టీచర్లు అవసరమవుతారు. ప్రైవేటు బడుల్లోనూ ప్రభుత్వ టీచర్లే ఇన్వి జిలేటర్లుగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, అభ్యసన కార్యకలాపాలు దెబ్బతింటున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో అడ్మి షన్లు,అకడమిక్ పనులు కొనసాగుతున్నాయి. దీనివల్ల 20 శాతం మంది ప్రైవేటు టీచర్లను ఇన్విజిలేటర్లుగా నియమించాలని ప్రభుత్వము భావిస్తుంది.
ఇంటర్మీడియట్ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించారు. ఫ్రీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాలు ఉండకూడదు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ప్రతి పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసి సమయంలో విద్యార్థికి ఎలాంటి శబ్దాలు ఉండకూడదు. తాగునీటి వసతిని ఏర్పాటు చేయాలి. తప్పుడు ప్రశ్నాపత్రాలు ఇస్తే ఇన్సులేషన్ చీఫ్ డిపార్ట్మెంటల్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పిల్లలు పరీక్ష రాస్తూ ఉంటే వారిని విధుల నుంచి తప్పించాలని కూడా సూచించారు. పరీక్ష విధుల్లో 60 సంవత్సరాలు దాటిన వారికి పూర్తి మినహాయింపు ఇవ్వాలని ఆదేశించారు. వీరితో పాటు దివ్యాంగులు బాలింతలు గర్భిణులు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మినహాయింపు ఉంటుంది. గతంలో కొద్దిమంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలను అడ్డుపెట్టుకొని మినహాయింపులు తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇకనుంచి ఉపాధ్యాయులకు మినహాయింపులు ఇవ్వటానికి అనుమతి లేదు. ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులతో పాటు వ్యాయామ క్రాఫ్టు వంటి ఉపాధ్యాయులను డ్యూటీకి వినియోగించుకోవాలని సూచించారు.

దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు..
.. ఇంటర్ పదో తరగతి పరీక్షలు రాసి దివ్యంగా విద్యార్థులకు ప్రభుత్వము వసతి సౌకర్యాలను కల్పించారు. పరీక్ష రాసే విద్యార్థులకు గ్రౌండ్ ఫ్లోర్ లోనే సెంటర్ ను కేటాయించాలని సూచించారు. ఏమాత్రము ఫస్ట్ ఫ్లోర్ గాని సెకండ్ ఫ్లోర్ లో గాని పై అంతస్తులలో దివ్యాంగులకు పరీక్షలు రాసేందుకు సీట్లను కేటాయించరా దు. ఏ ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చుని పరీక్ష రాసేందుకు వీలు లేదు. అందరికీ బెంచ్ లు డిస్క్‌లలో పరీక్షలు రాయించాలి. నిబంధనలు పాటించని సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
అలాగే ప్రస్తుత విధానంలో ఏదైనా ఒక సబ్జెక్టు పరీక్ష ను బోధించే ఉపాధ్యాయుడికి ఆ సబ్జెక్టు టీచర్లకు ఇన్విజిలేషన్ డ్యూటీ వేయరు.ఇకపై గణితం, సైన్స్, సోషల్ అయినా గ్రూపు సబ్జెక్టులు పరీక్షలు జరిగేటప్పుడు భాషా సబ్జెక్టుల టీచర్లను..భాషా పరీ క్షలు జరిగే సమయంలో గ్రూపు సబ్జెక్టుల గణితము సైన్సు సోషల్ టీచ ర్లను ఇన్విజిలేటర్లుగా నియమించాలని నిర్ణయించారు.అలాగే అనారోగ్య సమస్యలున్న టీచర్లకు కొన్ని మినహాయింపులుంటాయి.ఈ నిబంధనల ప్రామాణికంగానే టీచర్లకు సాఫ్ట్వేర్ ఇన్విజిలేటర్ బాధ్యతలు కేటాయిస్తుంది. ఫలితంగా ఇన్విజిలే షన్ కేటాయింపు విషయంలో టీచర్లు,అధికారులు జోక్యం,నిబంధనల ఉల్లంఘనలు ఉండవని పాఠ శాల విద్యాశాఖ అధికారులు భావించి ఈ ఆదేశాలను పాటించాలని సూచించారు.
