Raashii Khanna | షూటింగ్‌లో గాయపడ్డ రాశి ఖన్నా

ప్రముఖ నటి రాశి ఖన్నా ఒక సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్ జరుగుతుండగా జరిగిన ఒక ఘటనలో ఆమె ముఖానికి, చేతులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక గాయాల‌కు సంబంధించి కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో రాశీ ముఖంపై చిన్నపాటి గీతలు, చేతులపై కమిలిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

”కొన్ని పాత్రలు మ‌న‌ల్ని అడగవు. వాటిని చేయాలంటే నీ శరీరం, నీ శ్వాస, నీకు తగిలే గాయాలు అన్నీ ఇవ్వాలి. నువ్వు ఒకసారి తుఫానులా తయారయ్యాక, ఉరుము వచ్చిన‌ భయపడవు. త్వరలో రాబోతుందంటూ” రాశీ పోస్ట్ చేసింది. అయితే రాశీ ఎందులో న‌టిస్తుంది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. మ‌రోవైపు రాశి ఖన్నా త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *