పవిత్ర రంజాన్ మాసం మానవాళికి మార్గదర్శిగా నిలుస్తుంది

పవిత్ర రంజాన్ మాసం మానవాళికి మార్గదర్శిగా నిలుస్తుంది

కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ : పవిత్ర రంజాన్ పండుగ పర్వదిన వేడుకలను శనివారం కంచికచర్ల మండలం పెండ్యాలలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. పెండ్యాల సమీపంలోని ఈద్గా వద్దకు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా (ఇమామ్ )ఈద్గా ప్రార్ధన మత గురువులు సయ్యద్ నిసార్ మెహది, సయ్యద్ మజ్హర్ హుస్సేన్ లు ఈద్గా ప్రార్ధన ( నమాజ్ ) ప్రారంభించి అల్లాహ్ గొప్పతనాన్ని, ఖురాన్ పవిత్రత గురించి వివరించారు.

ఈ సందర్భంగా మత గురువులు సయ్యద్ నిసార్ మెహది, సయ్యద్ మజ్హర్ హుస్సేన్ లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అల్లాహ్ చూపిన శాంతి, కరుణ, దయ, సేవా మార్గంలో నడుచుకోవాలన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు పవిత్రమైనవని ఆయన బోధించిన మార్గంలో నడవడం శాంతి, మతసామరస్యం, ఎదుటి వారిపై ప్రేమాప్యాయతలు చూపటమే ఇస్లాం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం మానవాళికి మార్గదర్శిగా నిలుస్తుందని రంజాన్ పర్వదిన విశిష్టతను వివరించారు. రంజాన్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాలతో జరుపుకొని సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ప్రార్ధన అనంతరం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గాలో ముస్లిం సోదరులు ఒకరికి ఒకరు అలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండలంలోని కంచికచర్ల, పరిటాల, మొగులూరు తదితర మసీదులలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Leave a Reply