నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI) మరియు పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరగాల్సిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ వర్షం ఆటకం కలిగిస్తుంది. టాస్ పూర్తయ్యిన తర్వాత ఆట ప్రారంభానికి ముందు వర్షం పడటం ప్రారంభమైంది. దాంతో ఆట ప్రారంభం ఆలస్యమవ్వనుంది.
కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుని ముంబైని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అయితే ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే… నెట్ రన్ రేట్ ఆధారంగా ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీతో పోటీపడటానికి పంజాబ్ అర్హత సాధిస్తుంది.