కార్యకర్తలకు అండగా క్యూఆర్ కోడ్ వ్యవస్థ

కార్యకర్తలకు అండగా క్యూఆర్ కోడ్ వ్యవస్థ
కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్నసమస్యలకు పరిష్కారానికి వైసీపీ(YCP) రూపొందించిన డిజిటల్ బుక్(Digital Book)ను శనివారం కర్నూలులో అధికారికంగా ఆవిష్కరించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేఎంసీ మేయర్ రామయ్య(KMC Mayor Ramaiah), డిప్యూటీ మేయర్ రేణుక, రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఎస్వీ విజయ మనోహరి(SV Vijaya Manohari) కలిసి ఈ డిజిటల్ బుక్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీకి పని చేస్తున్నకార్యకర్తలు ఎలాంటి ఆపదలో ఉన్నా, వారి సమాచారం తక్షణమే నాయకత్వానికి చేరేలా క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ బుక్‌ను రూపొందించాం. ప్రతి కార్యకర్తకు ప్రత్యేక క్యూఆర్ కోడ్(QR code) ఇవ్వబడుతుంది. ఈ ఆధునిక వ్యవస్థ ద్వారా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడమే లక్ష్యం అని తెలిపారు.
అధికార పార్టీ(ruling party) నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నకార్యకర్తలకు ఇది సత్వర సాయం అందించే మాధ్యమంగా నిలవనుందని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలకు భద్రత కల్పించడంలో ఈ డిజిటల్ బుక్ కీలక పాత్ర పోషించనుందని వైకాపా నేతలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్(Ahmed Ali Khan), మాజీ గ్రంథాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్(Subhash Chandra Bose), పార్టీ కార్పొరేటర్లు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.
