మహిళా సంఘాలకు.. కొనుగోలు కేంద్రాలు
కమ్మర్ పల్లి,అక్టోబర్ 24 ( ఆంధ్ర ప్రభ ): కమ్మర్ పల్లి మండలం లోని కోన సమంధర్, బషీరాబాద్, కొత్త చెరువు తాండా, ఇనాయత్ నగర్, గ్రామలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రారంభించినట్లు ఐకెపి ఎపిఎం గోపు.కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తాహశీల్దార్ జి. ప్రసాద్, ఏఎంసి చైర్మన్ పాలేపూ నర్సయ్య లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం మహిళలకు ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందని మహిళా సంఘాలకు అధిక సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాలకు చెందిన రైతులు, మహిళా సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తేమ శాతం 17 కు మించకుండా మైచ్చర్ వచ్చిన వరిని మాత్రమే తూకం చేయాలని తెలిపారు. ఏ గ్రేడ్ కు రూ. 2,389,బి గ్రేడ్ కు రూ.2,369 ప్రభుత్వం ధర నిర్ణయించిందని, రైతులు దళారులకు నమ్మి మోసపోవద్దనీ సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న,ఆర్ ఐ శరత్,ఏ ఈ ఓ స్వామి,సిసిలు రవి,పీర్య నాయక్, భాగ్యలక్ష్మి,మహిళా సంఘాల సభ్యులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

