PURANAPANDA |బుక్ ఫెయిర్‌కి పురాణపండ ప్రోత్సాహం..మరువలేనిది…

PURANAPANDA | బుక్ ఫెయిర్‌కి పురాణపండ ప్రోత్సాహం..మరువలేనిది…

PURANAPANDA | హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : వివిధ భాషల వందల బుక్ స్టాల్స్ మధ్య ఆస్కార్ పురస్కార విజేత, విఖ్యాత సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి, తెలంగాణ ప్రభుత్య ప్రత్యేక కార్యదర్శి ఐఏఎస్ రామకృష్ణారావు, హైడ్రా కమిషనర్ రంగనాధ్, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్, అల్లం నారాయణ, దేవులపల్లి అమర్…. విఖ్యాత నవలా రచయితలు, దర్శకులు యండమూరి వీరేంద్రనాధ్, వంశీ, ప్రఖ్యాత కవులు నగ్నముని, సన్నిధానం నరసింహ శర్మ, వాడ్రేవు చినవీరభద్రుడు, కుప్పిలి పద్మ, సతీష్ చందర్, ఎన్. వేణుగోపాల్, మెర్సీ మార్గరెట్, ప్రముఖ ప్రజాకవి గాయకులైన గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, సాహితీ రంగపు విశ్లేషకులు అబ్దుల్ రాజా హుస్సేన్, ప్రముఖ రచయితలు, రచయిత్రులు తల్లావజ్జుల పతంజలి శాస్త్రి, మధురాంతకం నరేంద్ర, ఖదీర్ బాబు, పురాణపండ శ్రీనివాస్, ఎమ్వీ రామిరెడ్డి, వల్లూరి రాఘవ రావు, అరుణాంక్ లత, గౌరీచందర్, స్వర్ణ కిలారి, సజయ, ఝాన్సీ కొప్పిశెట్టి, సమ్మెట విజయ, డాక్టర్ గీతాంజలి, గ్రామదేవత బుక్ ఫేమ్ శ్రీపద్మ, చిల్లర భవానీదేవి, అత్తలూరి విజయలక్ష్మి, రోహిణీ వంజారి, ఒమ్మి రమేష్ బాబు, నరేష్కుమార్ సూఫీ, విశీ, వంశీ ఇంటర్నేషనల్ చైర్మన్ వంశీరామరాజు, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకారిణి అనంతలక్ష్మి, సరస్వత్రీ పుత్రులు దైవజ్ఞ శర్మ … ఇలా ఎందరో .. ఎందరెందరో సాహితీ రంగపు ప్రముఖులే కాకుండా ప్రజా గళాలు ఏపూరి సోమన్న, మిట్టపల్లి సురేందర్, రేలారే గంగల వంటి కళాకారుల ప్రదర్శనలతో, సందడితో హైదరాబాద్ నగరంలోని 38వ జాతీయ పుస్తక ప్రదర్శన అందెశ్రీ ప్రాంగణం ఎంతో హుందాగా వైవిధ్య భరితమైన అంశాలతో దద్దరిల్లి పోయింది.

PURANAPANDA |

మరొక వైపు ఆధ్యాత్మిక పుస్తక విక్రయకేంద్రాల్లో చాగంటి కోటేశ్వర రావు, గరికపాటి నరసింహారావు, సామవేదం షణ్ముఖ శర్మ, వద్దిపర్తి ప్రభాకర్ వంటి మహామహుల పుస్తకాల్ని సైతం దాటి ప్రముఖ రచయిత, నిశ్శబ్ద నిస్వార్ధ సేవలో నిర్మాణాత్మక కార్యశీలిగా పేరొందిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అమోఘ రచనా సంకలనం శ్రీమాలిక బుక్ అగ్రస్థానంలో దూసుకుపోయి వందలమందిని ఆకట్టుకోవడం ఈబుక్ ఫెయిర్ లో గమనార్హంగానే చెప్పాలి.

PURANAPANDA |

గత సంవత్సరమూ పురాణపండ శ్రీనివాస్ అదివో … అల్లదివో తిరుమల మహాక్షేత్ర సౌందర్యం మంత్ర , కథా వైభవ గ్రంధం అమ్మకాల్లో తొలి వరుసలో నిలవడాన్ని ఈ సందర్భంలో పలువురు ఆధ్యాత్మిక పుస్తక విక్రేతలు ప్రస్తావిందాన్ని ప్రత్యేకంగా పేర్కొనాలి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ అధ్యక్షులు, ప్రముఖ కవి యాకూబ్ మాట్లాడుతూ… ఆత్మబంధువులాంటి సాహితీ మిత్రులు పురాణపండ శ్రీనివాస్ కించిత్ స్వార్ధం లేకుండా ఈ సంవత్సరం బుక్ ఫెయిర్‌కి అందించిన పరోక్ష, ప్రత్యక్ష ప్రోత్సాహం మరువలేనిదని కమిటీ నిర్వాహకులైన నారాయణరెడ్డితో కలిసి చెప్పటం విశేషం.
రెండున్నర దశాబ్దాలనాటి గోదావరీ తీరం స్నేహం ఈ బుక్ ఫెయిర్ లో శ్రీనివాస్ మరొకసారి ఆత్మీయంగా గుర్తుకు తెచ్చారని పేర్కొన్నారు. ఎందరో రచయితలు, కవులు తామే బుక్ స్టాల్స్ లో కూర్చొని కవిత్వ సాహిత్య గ్రంధాలు విక్రయించడం, కవిత్వ ముచ్చట్లు చెప్పుకోవడం ఎంతో సందడిగా ఈ పదిరోజులూ అందమైన వాతావరణంగా కనిపించింది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటైన ఈ పుస్తకాల పండుగలో సుమారు రెండువందల బుక్ స్టాల్స్ పాల్గొన్నాయి.

PURANAPANDA |

మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించిన ఈ పుస్తకాల వేడుక కారణంగా ఈ పదిరోజులూ ఇందిరాపార్క్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకూ పుస్తక ప్రియులతో ఒక సంబరంగా … ఒక దశలో ట్రాఫిక్ తో నిండిపోవడం ఆశ్చర్యంగా అన్పించింది. నవోదయ, విశాలాంధ్ర, నవచేతన, ఈషా ఫౌండేషన్, ఛాయా, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, సాహిత్య అకాడెమి, తెలంగాణ సాంస్కృతిక శాఖ, స్తొత్రనిధి, ఆదర్శిని మీడియా, అన్వేక్షిణి, జాగృతి, నవ తెలంగాణ, గొల్లపూడి వీరాస్వామి సన్, భారతీయ విద్యాభవన్, అజు పబ్లికేషన్స్ వంటి ఎన్నో ప్రఖ్యాత ప్రచురణ సంస్థల ప్రచురణలు అనూహ్య స్పందన లభించడం విశేషం.

మరీ ముఖ్యంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని లేఖిని సంస్థలో ఉన్న వందకు పైగా రచయిత్రులు సంఘీభావంతో తమ సంస్థ కార్యవర్గంలో ప్రధాన భూమిక నిర్వహించే ప్రముఖ రచయిత్రులు చంగల్వల కామేశ్వరి, జ్యోతి వల్లబోజుల పర్యవేక్షణలో ఎంతోమంది ప్రముఖులకు శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ సంచలనాత్మక పవిత్ర గ్రంధం నాలుగు వందల పేజీల శ్రీమాలిక గ్రంధాన్ని సుమారు రెండువందల మంది ప్రముఖులకు, పాఠకులకు బహుకరించడం ఈ సంవత్సరం బుక్ ఫెయిర్ లో హాట్ టాపిక్ ! కొందరైతే పుస్తక పండుగ ప్రాంగణంలోనే శ్రీమాలికలో కొన్ని ఘట్టాల్ని ఆసక్తిగా చదవడం మీడియా కంటబడింది.

PURANAPANDA |

కవి సమ్మేళనాల జోరు, నృత్యాల హోరు, అనేకమంది రచయితల, కవుల గ్రంథావిష్కరణలతో ఈసారి పుస్తక ప్రదర్శన తీరు వేలకొలది రసజ్ఞుల, పాఠకుల హృదయాల్ని ఉర్రూతలూగించిందనే చెప్పాలి. ఏది ఏమైనా హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీలో కీలకంగా వ్యవహరించిన ప్రఖ్యాత కవి యాకూబ్ తో పాటు కమిటీలోని ఆర్.శ్రీనివాస్, నవచేతన నారాయణరెడ్డి, బాల్ రెడ్డి, శోభన్ బాబు, సురేష్, సూరిబాబుల ఐకమత్య సహకారాన్ని, ఎక్సిక్యూటివ్ కమిటీ మొత్తాన్ని ఈ విజయంలో భాగస్వామ్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించడం విశేషం.

Leave a Reply