Pulse Polio | పోలియో నిర్వహణలో ఫస్ట్..

Pulse Polio | పోలియో నిర్వహణలో ఫస్ట్..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడంలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 95.49% మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి యుగంధర్ తెలిపారు. 1,45,588 చిన్నారులకు గానూ 1,39,024 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామన్నారు.

Leave a Reply