Publicity | విజయం దిశగా..

Publicity | విజయం దిశగా..


Publicity | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రం అంబేద్కర్ నగర్ ప్రజలు నిండుగా ఆశీర్వదించండి.. అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తానని కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి వాసం సుష్మిత అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్, భగత్ సింగ్ సెంటర్, మీదుగా రజకులు బీసీ కాలనిలోని బాల్ గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేయాలని ఓటర్లతో మమేకమై ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. పదవి ముఖ్యం కాదు.. ప్రజా సేవే నా లక్ష్యంగా.. ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని, ప్రజల అభీష్టం మేరకు, కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా మీముందుకు వస్తున్నాను అన్నారు.

ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేస్తానని ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్దే ధ్యేయంగా పని చేస్తానని తెలిపారు. ఆళ్లపల్లి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, వాడవాడలా ప్రచారం చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తానని, రోడ్లను, మురికి కాల్వలను మరమ్మత్తు చేయించి అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. మహిళల, యువత అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తానని తెలిపారు. సేవకురాలిగా అంకితభావంతో పని చేస్తానని హామీచ్చారు.

ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని, అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ అందరికీ చేదోడువాదోడుగా పని చేస్తూ ముందుకు సాగుతానన్నారు. గ్రామంలోని కోతుల బెడద నుండి విముక్తి కలిగే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వాసం శ్రీకాంత్, మహమ్మద్ అతాహార్,మంగ,బుర్రవెంకన్న,సత్యం, సుమన్, శ్రీను, పద్మ, అజ్జూ, సుధాకర్, జీవన్, కృష్ణ, రమ నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply