Publicity | అత్యధిక మెజార్టీ తో గెలిపించండి
Publicity | పెద్దవంగర, ఆంధ్రప్రభ : ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బొమ్మకల్లు మేజర్ గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొడకంటి యాకన్న గౌడ్ అన్నారు. వాడవాడలా తిరుగుతూ ఈ రోజు జోరుగా ప్రచారం చేపట్టారు. తప్పకుండా ఉంగరం గుర్తుకు ఓటు వేయాలన్నారు. తనను ఆశీర్వదిస్తే అన్ని రంగాల్లో గ్రామాభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రచారంలో గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలు, యువత, కాంగ్రెస్ కార్యకర్తలు మద్దతుగా నిలుస్తున్నారు.



