Nandyala | ప్రజా సంక్షేమమే టీడీపీ ధ్యేయం… స్పీకర్ అయ్యన్న

నంద్యాల బ్యూరో, మే 16 (ఆంధ్రప్రభ) : ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని, ప్ర‌జా సంక్షేమమే టీడీపీ ధ్యేయమని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. జిల్లాకు వచ్చిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు శుక్రవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లెలో ఉన్న నివాసానికి రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ తో కలసి వచ్చారు.

రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ, న్యాయశాఖ మంత్రి ఫరూక్ తో కలిసి రాష్ట్ర శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమం వంటి కార్యక్రమాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ప్రజలు ఇచ్చిన స్పందనను చూసి స్పీకర్ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారిశ్రామికంగా, ఆర్థికంగా, అభివృద్ధి, సంక్షేమం వైపు అడుగులు వేస్తూ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నాడని పేర్కొన్నారు. బనగానపల్లెకు వచ్చిన స్పీకర్ కు సాదర స్వాగతం పలికి, శాలువాతో సత్కరించి, శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రతిమను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి బీసీ ఇందిరమ్మ దంపతులు అందజేశారు.

Leave a Reply