పదవులు ముఖ్యం కాదు..
- తెలుగు వారికి సాయం అందించడంలో ముందుంటున్న నారా లోకేష్
- మయన్మార్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను రప్పించే ప్రయత్నం
( ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి) : మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు తెలుగు ప్రజలంటే ఎనలేని అభిమానం. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాల వ్యవధిలోనే అధికారం చేపట్టిన మహనీయుడు ఎన్టీఆర్. ఆయన మనుమడు నారా లోకేష్ కు తెలుగు ప్రజలంటే ఎనలేని అభిమానం. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఎక్కడ ఉన్న వారిని ఆత్మీయంగా పలకరించడం, ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని ఆదుకోవడంలో ఆయన ముఖ్య భూమిక పోషిస్తుంటారు. కృష్ణా జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు ప్రజలు ఏదైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే ముందుగా స్పందించే వ్యక్తి నారా లోకేష్. పెనమలూరు నియోజకవర్గం కానూరు గ్రామానికి చెందిన హెప్సిబా ఏంజెల్, ఇతర విద్యార్థులు మయన్మార్‌లో చిక్కుకున్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ట్విటర్ లో పోస్ట్ చేయడంతో నారా లోకేష్ స్పందించారు.
వీలైనంత త్వరగా వారు సురక్షితంగా తిరిగి వచ్చేలా నేను విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. నాలుగు రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రంలో అక్కడి ఆటోవాలాల ద్వారా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండల వాసులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న నారా లోకేష్ అక్కడి మంత్రి ఉదయనిధి స్థాలిన్ తో మాట్లాడి డిఎస్పీ రక్షణలో సురక్షితంగా స్వగ్రామాలకు తీసుకురావడంలో మంత్రి చూపిన చొరవ చూపారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో నేపాల్ లో జరిగిన అల్లర్లలో అక్కడ ఉన్న తెలుగువారిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంలో ఆయన చూపిన చొరవను పలువురు ప్రసంశించడం జరిగింది. ట్విట్టర్ లో వచ్చిన ప్రతి మెసేజ్ కి స్పందిస్తూ పేద వర్గాలను ఆదుకోవడంలో కూడా ప్రముఖ పాత్ర నారా లోకేష్ పోషిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తున్న నారా లోకేష్ ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.

