చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ప్రజాపాలన……

చెన్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఇవ్వాళ చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో వార్డు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, ఫిర్యాదులను మున్సిపల్ కౌన్సిలర్లు మరియు సంబంధిత శాఖల అధికారులు స్వీకరించారు.ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.స్థానిక సమస్యలపై ప్రజలతో నేరుగా మమేకమవుతూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు.
